Mahesh Babu: సూర్యా భాయ్ ఒక డ్రగ్ లాంటోడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్ ‘సూర్య భాయ్’ అనే కొత్త డ్రగ్ ని తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యేలా చేసాయి. పదమూడేళ్లు దాటినా ఆ డ్రగ్ మత్తు తెలుగు ప్రేక్షకులని వదలలేదు. హీరో క్యారెక్టరైజేషన్ పీక్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటుందో బిజినెస్ మాన్ సినిమా నిరూపించింది. ఈ మూవీలోని ముంబైని పోయించడానికి వచ్చాను, డిల్లికి ఏం కావాలో చెప్పు ఇస్తాను, రౌండప్ చేసి కన్ఫ్యూస్ చెయ్యొద్దు కంఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తా, మన అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి లాంటి డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా చేశాయి.
కేవలం మహేశ్ బాబు ఫాన్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ గా ప్రతి ఒక్కరికీ నచ్చిన ఈ మూవీ నిజంగానే ఒక సెన్సేషన్. అందుకే బిజినెస్ మాన్ సినిమాకి సీక్వెల్ వస్తుందని, పూరి-మహేశ్ కాంబోలో సినిమా వస్తుందని సినీ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు కానీ బిజినెస్ మాన్ 2 మొదలయ్యే అవకాశం కనిపించట్లేదు. సీక్వెల్ వెయ్యగల సత్తా ఉన్న క్యారెక్టర్ ని దర్శకుడు, హీరో వదిలేసి సైలెంట్ గా ఉండి పోయారు. ఈరోజుకీ మహేష్-పూరి కాంబినేషన్ ని కోరుకునే ఫాన్స్ ఉన్నారు అంటే అది బిజినెస్ మాన్ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఫుల్ జోష్ లో సాగుతుంది కాబట్టి బిజినెస్ మన్ సినిమా రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ చెయ్యనున్నారు. సాధారణంగా రీరిలీజ్ అంటే ఆ హీరో ఫాన్స్ మాత్రమే వెళ్తారు కానీ బిజినెస్ మాన్ సినిమా చూడడానికి మాత్రం ప్రతి హీరో ఫాన్స్ వెళ్తారు. సో కచ్చితంగా బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ. మరి ఈ సినిమాకి వచ్చే రీచ్ ని చూసైనా మహేష్ అండ్ పూరి మళ్లీ సినిమా చేస్తారేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!