పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న భర్త కోపంతో రగిలిపోయాడు. గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read:Road Accident: పట్టపగలే పీకలదాకా తాగి.. ఆగి ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టిన యువకుడు!
కాన్పూర్ జిల్లాలోని బంబురిహా గ్రామానికి చెందిన బాబురామ్ గౌతమ్, శాంతి భార్యాభర్తలు. భార్య శాంతి గత కొన్ని నెలలుగా మరొక వ్యక్తితో మాట్లాడుతోంది. ఇది తెలిసిన బాబురామ్ భార్యను హెచ్చరించాడు. కానీ శాంతి తన బుద్ది మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. చివరకు భార్యను హత్య చేసి తాను తనువు చాలించాడు. పిల్లల కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని షాక్ కు గురయ్యారు. వెంటనే వారు పోలీలసులకు సమాచారం అందించారు.
బాబూరామ్ జీవిత కథ సినిమా కథలా ఉంది. అతను మొదట 2009లో షాపూర్‌కు చెందిన నాంకిని వివాహం చేసుకున్నాడు. వారికి చందన్, లాలి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, వైవాహిక విభేదాలు పెరిగి, తొమ్మిది సంవత్సరాల క్రితం నాంకి అతన్ని విడిచిపెట్టింది. 2018లో, బాబూరామ్ మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సర్సౌల్కు చెందిన శాంతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అంకుష్, అర్పిత్ అనే ఇద్దరు కుమారులు, నిత్య అనే కుమార్తె ఉన్నారు.
Also Read:Hyderabad Child Torture: నువ్వేం తల్లివి.. ప్రియుడితో కలిసి 4 ఏళ్ల కూతురుకి టార్చర్..
కొంతకాలం తర్వాత వీరి కాపురంలో కలహాలు చెలరేగాయి. దీంతో శాంతి మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. నీతో ఉండను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని బాబూరామ్ కు చెప్పింది. దీంతో భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే భార్యను హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.