కృష్ణా జిల్లా, గుడివాడలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర, హీరో , మారుతి లాంటి దిగ్గజ కంపెనీలతోపాటు మొత్తం 45 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. VKR & Vnb పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన మేళాలో రెండు వేల మందికి పైగా విద్యావంతులు పాల్గొన్నారు.మేళాలో పాల్గొన్న యువతకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Also: Edema in Foot: పాదాలలో వాపు దేనికి సంకేతం?
రాష్ట్రంలో యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న పోరాటాలకు సంఘీభావంగా నేడు గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు.చేతగాని పాలకుల వల్ల లక్షలాది మంది విద్యావంతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారనీ, యువతకు ఉపాధి మార్గాలు చూపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము అభినందనీయులని టిడిపి నేతలు కొనియాడారు.ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జాబ్ మేళా ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఉపయోగపడుతుందని యువత హర్షం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశను ప్రారంభించిన ప్రధాని