TTD Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Also Read: AP Coronavirus Cases: గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్ కేసులు!
Also Read
ఓవైపు వేసవి సెలవులు ముగింపుకు రావడం, మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. మరో వారం రోజుల పాటు భక్తుల రద్ధీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు తగిన ఏర్పాట్లను టీటీడీ అరేంజ్ చేస్తోంది. ఇటీవల కాలంలో మెట్ల మార్గం, రోడ్డు మార్గాల్లో పులులు సంచరిస్తుండడంతో.. భక్తులు రక్షణ కోసం టీటీడీ, ఫారెస్ట్, పోలీసుల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!