Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Fronx: కారు మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మారుతి సుజుకి సంస్థ, తాజాగా తన పాపులర్ కారు ‘ఫ్రాంక్స్’కు మేకోవర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో బలేనో ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు అందరిచూపు తన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన ‘ఫ్రాంక్స్’ అప్డేటెడ్ వెర్షన్ పైకి మళ్లించింది. ఈ కొత్త కారు రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారు మొత్తం పూర్తిగా క్యామోఫ్లాజ్ (కప్పి ఉంచే స్టిక్కర్లు)తో కవర్ చేసి ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన కొన్ని అదిరిపోయే ఫీచర్లు మాత్రం బయటపడ్డాయి.
ఈ కొత్త ఫ్రాంక్స్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండనుంది. ముందువైపు డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్డ్ అవుట్ ఎలిమెంట్స్‌తో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, పెద్దదైన ఫ్రంట్ గ్రిల్ దీని ప్రత్యేకత. ముఖ్యంగా ముందు గ్రిల్లో కొన్ని కొత్త మార్పులు చేశారు. ఈ ఎస్‌యూవీకి మరింత బోల్డ్ లుక్ తీసుకురావడానికి కింద ఫాక్స్ స్కిడ్ ప్లేట్లను జత చేశారు. ఇక సైడ్ లుక్ విషయానికి వస్తే, అచ్చం పాత మోడల్ లాగే కనిపిస్తున్నా, వెనుక వైపు డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అంటే మార్పులన్నీ ఎక్కువగా కారు ముందు భాగంలోనే కనిపిస్తాయన్నమాట. కొత్త ఫ్రాంక్స్ లో ఫీచర్ల కోలాహలం గట్టిగానే ఉండనుంది. ముఖ్యంగా మారుతి తన బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో అందించినట్లే, ఈ కొత్త కారులో ‘లెవల్-2 ఏడాస్ (ADAS)’ ఫీచర్‌ను ఇస్తారని సమాచారం. దీనివల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక క్యాబిన్ లోపల పెద్దగా మార్పులు లేకపోయినా, పాత వాటితో పాటు మరిన్ని హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. కీ లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, హెడ్స్ అప్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటివి ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్, 16 అంగుళాల అలాయ్ వీల్స్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి అన్నీ ప్రీమియం ఫీచర్లు ఇందులో రానున్నాయి.
Also Read
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
- బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
- 2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
అయితే, ఈ కారులో అసలైన పెద్ద మార్పు ఇంజిన్ పరంగా ఉండే అవకాశం ఉంది. మారుతి తన లేటెస్ట్ మోడల్స్‌లో ఇస్తున్న 1.2 లీటర్ త్రీ-సిలిండర్ Z12E ఇంజిన్‌ను (బలేనో, డిజైర్, స్విఫ్ట్ కార్లలో వస్తున్నదే) ఈ ఫ్రాంక్స్లోనూ ఇవ్వొచ్చు. అంతేకాకుండా, మారుతి సంస్థ ఒక సరికొత్త, చౌకైన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌పై కూడా పనిచేస్తోందని, భవిష్యత్తులో అది కూడా ఈ కారులోకి వచ్చే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ హైబ్రిడ్ వెర్షన్ ఇప్పుడప్పుడే లాంచ్ అయ్యే సూచనలు మాత్రం లేవు. ఇక, ప్రస్తుత మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.90 లక్షలుగా ఉంది. ఇక దీని మైలేజ్ విషయానికి వస్తే, సీఎన్జీ వెర్షన్లో ఈ కారు కిలోకు దాదాపు 28.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండటం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్లో అదిరిపోయే లుక్, లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ కొత్త ఫ్రాంక్స్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
తాజావార్తలు
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
ట్రెండింగ్
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!