NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG: దేశంలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ తీరు, వాటి పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రజా పరీక్షల వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై సమగ్రంగా సమీక్ష జరిపేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆరంభంలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యుజి (NEET UG) ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ నీట్-యుజి 2026 రద్దు కావడం, పరీక్షల నిర్వహణలో మరింత మెరుగైన విధానపరమైన, సంస్థాగత మార్పుల అవసరాన్ని స్పష్టం చేస్తోందని గత పార్లమెంటరీ కమిటీ కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో విద్యా, మహిళా, శిశు, యువజన, క్రీడల శాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘం (Standing Committee) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కోచింగ్ సెంటర్ల పనితీరు, వాటికి సంబంధించిన నిబంధనలు, అమలు తీరు, అవి ఏ మేర నిబంధనలు పాటిస్తున్నాయో ప్రత్యేకంగా సమీక్షించనుంది.
ఈ ఏడాది సెప్టెంబరులో ఏడాది వ్యవధి కోసం పునర్వ్యవస్థీకరించబడిన ఈ పార్లమెంటరీ కమిటీ, 2026-27 సంవత్సరానికి గాను తాము చేపట్టబోయే సమీక్షాంశాలను ఎంచుకుంది. లోక్సభ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. జాతీయ విద్యా విధానం (NEP) 2020 అమలు పురోగతిని కూడా ఈ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పనితీరును, వాటి గుర్తింపులు, నిబంధనలు, పరీక్షల నిర్వహణ, విదేశీ కార్యకలాపాలతో పాటు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (CABE) మూలాలను కూడా సమీక్షిస్తుంది. పాఠశాల విద్యలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, మానసిక ఉల్లాసం, సమ్మేళిత విద్య, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలతో సహా వారి సంక్షేమానికి సంబంధించిన మద్దతు విధానాలపై దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా, విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నూతన సాంకేతికతల ప్రభావం, విద్యార్థుల ఉద్యోగావకాశాలపై దాని ఫలితాలను పరిశీలిస్తూనే.. ఉన్నత విద్య అంతర్జాతీయకరణపై యుజిసి (UGC) నిబంధనలు, మార్గదర్శకాల అమలు తీరును కూడా ఈ కమిటీ నిశితంగా అంచనా వేయనుంది.
Also Read
- Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- Bancroft: బాల్ ట్యాంపరింగ్ అందరికీ తెలుసు.. ఆస్ట్రేలియా బండారం బయటపెట్టిన బ్యాన్క్రాఫ్ట్..
- UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
తాజావార్తలు
-
Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
-
Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..