Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Crime: చెన్నై నగరంలో పట్టపగలే ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. రాయపేట ప్రాంతంలోని ప్రముఖ చార్మినార్ బిర్యానీ సెంటర్లోకి చొరబడిన దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. కౌంటర్లో ఉన్న క్యాషియర్‌పై విచక్షణారహితంగా, అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం క్యాష్ కౌంటర్లోని నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు బహిరంగంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
అయితే ఈ దారుణ దాడికి దారితీసిన కారణాలు విస్మయం కలిగిస్తున్నాయి. హోటల్లో సర్వ్ చేసిన బ్రెడ్ హల్వా రుచి బాగాలేదంటూ సదరు యువకులు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు ప్రాణాంతక దాడికి దారితీసిందని తెలుస్తోంది. మాటమాట పెరగడంతో దుండగులు కత్తులు తీసి నేరుగా క్యాషియర్‌పై దాడి చేసి, దుకాణంలోని నగదును లూటీ చేశారు.
Also Read
- PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!