తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు…
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు టీటీడీ…
శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది.…
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు…
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం…