వరలక్ష్మి శరత్ కుమార్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి..తమిళ్ తో పాటు మలయాళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేసి మెప్పించింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది.దాంతో లేడీ విలన్ గా మారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అలాగే యాక్టింగ్ కు స్కోప్ వున్న పాత్రలు ఎంచుకొని విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరలక్ష్మి విలన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేస్తూ అదరగొడుతుంది.
రీసెంట్ గా ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరలక్ష్మి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నవిషయం తెలిసిందే.ప్రముఖ వ్యాపారవేత్త సచ్‌దేవ్‌తో ఆమెకు నిశ్చితార్థం కూడా అయింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుండే వరలక్ష్మీ శరత్‌కుమార్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఆ వీడియో లో ‘పెళ్లి చేసుకో.. లైఫ్ చాలా బాగుంటుంది’ అని ఆమె సలహా ఇవ్వగా మరో వ్యక్తి ‘ఎవరి లైఫ్?’ అని అడుగుతూ కనిపిస్తాడు. ఫొటోగ్రాఫర్స్, క్యాటరింగ్ వాళ్లు,డెకరేషన్ వాళ్ళు అంటూ ఆమె చెప్పుకొస్తుంది.అయితే ఆర్తి అనే అమ్మాయి తమిళ్‌లో చేసిన వీడియోను స్ఫూర్తిగా తీసుకుని తాను ఆ వీడియో చేసినట్లు ఆమె తెలిపింది.అయితే వరలక్ష్మి షేర్ చేసిన వీడియోకి నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి చేసుకుంటున్నా అన్నారు .మరి ఇలా అనేసారేంటి అని కొందరు కామెంట్ చేస్తున్నారు .