HUAWEI Watch Fit 4 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ హువాయి (HUAWEI) భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌వాచ్‌లను HUAWEI WATCH FIT 4, WATCH FIT 4 Pro లను లాంచ్ చేసింది. ఇవి ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఆరోగ్య ఫీచర్లతో ఈ వాచ్‌లు లాంచ్ అయ్యాయి. మరి ఈ రెండు రకాల స్మార్ట్‌వాచ్‌ల గురించి చూద్దమా..
WATCH FIT 4 సిరీస్‌లో రెండు మోడళ్లకూ 1.82 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 480×408 పిక్సెల్స్, 347 PPI పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉండి 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని వల్ల ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. హువాయి WATCH FIT 4, FIT 4 Pro రెండింట్లోనూ 24 గంటల ఆరోగ్య నిఘా అందుతుంది. ఇవి హృదయ స్పందన (Heart Rate), ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయి, ఇంకా మహిళలలో నెలసరి ఋతుచక్రాలను ట్రాక్ చేస్తాయి.
Read Also:TECNO POVA 7 Pro 5G: సరికొత్త ఇంటర్‌ఫేస్తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన టెక్నో పోవా..!
ముఖ్యంగా Health Glance 2.0 సపోర్ట్‌తో, ECG, టెంపరేచర్, డెప్త్ సెన్సార్ లాంటి మరిన్ని సెన్సార్ల ద్వారా మెరుగైన ఆరోగ్య సమాచారం అందుతుంది. ఇందులో 100 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్‌లు, కమ్ప్లీట్ GPS ట్రాకింగ్, ఆక్టివిటీ రింగ్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ సాధనలో ఇది మీకు సహాయపడే ప్రీమియం గాడ్జెట్ గా నిలుస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్ కాలింగ్, వాయిస్ నోట్ టేకింగ్, క్యామెరా కంట్రోల్, లైవ్ వ్యూ, వెదర్ అప్‌డేట్స్, వాచ్ ఫేసెస్ వంటి ఫీచర్లతో వస్తాయి. Huawei హెల్త్ యాప్ ద్వారా ఈ వాచ్‌లను నిర్వహించవచ్చు. WATCH FIT 4 సిరీస్ వాచ్‌లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. Always-On Display (AOD) మోడ్‌లో వాడితే 4 రోజుల వరకు పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. Pro మోడల్‌లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇకపోతే, WATCH FIT 4 Pro మోడల్ టైటానియం అలాయ్ బెజెల్, అల్యూమినియం అలాయ్ బాడీతో రూపొందించబడింది. ఇందులో Dual Band GNSS (L1 + L5) సపోర్ట్ ఉంది. ఈ మోడల్ IP6X డస్ట్ రిసిస్టెన్స్, డైవింగ్ మోడ్ (40 మీటర్ల లోతు వరకూ) వంటి ఫీచర్లతో ఔట్ డోర్ యాక్టివిటీలకు అనువుగా ఉంది. రొటేటింగ్ క్రౌన్ ద్వారా నావిగేషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే WATCH FIT 4 కేవలం 9.5mm మందం, 27 గ్రాముల బరువుతో సొగసైన ఆకృతిని కలిగి ఉంది. ఇది ఆరోగ్య, ఫిట్‌నెస్ ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది.
Read Also:TECNO Pova 7 5G: ఇంత తక్కువ ధరకు అన్ని ప్రీమియం ఫీచర్లా.. కొత్త టెక్నో పోవా 7 5G విడుదల..!
ఇక ధరలు, కలర్ ఆప్షన్లు, లభ్యత విషయానికి వస్తే.. వాచ్ ఫిట్ 4 మోడల్ ధర రూ.12,999 గా నిర్ణయించబడింది. ఇది బ్లాక్, వైట్, పర్పుల్, గ్రే రంగులలో లభ్యమవుతుంది. ఇది ఆరోగ్యాన్ని గమనించడంలో ఆసక్తి ఉన్న వారికి పైనలైటెడ్ డిజైన్‌తో హైఎండ్ ఫీచర్లను అందిస్తుంది. అలాగే వాచ్ ఫిట్ 4 ప్రో మోడల్ ధర రూ. 20,999. ఈ ప్రో వర్షన్ గ్రీన్ నైలాన్, బ్లూ ఫ్లోరోఎలాస్టోమర్, బ్లాక్ ఫ్లోరోఎలాస్టోమర్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ రెండు వాచ్ మోడల్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికలపై ప్రీఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి.