TECNO POVA 7 Pro 5G: టెక్నో మొబైల్స్ హామీ ఇచ్చినట్లుగానే అత్యాధునిక ఫీచర్లతో కూడిన TECNO POVA 7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్ల కలయికతో అందుబాటులోకి వచ్చింది.
డిస్ప్లే:
POVA 7 Pro 5G ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2304Hz PWM డిమ్మింగ్ వంటివి కలిగి ఉండి మరింత నాణ్యమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. స్క్రీన్‌పై Gorilla Glass 7i ప్రొటెక్షన్ అందించబడింది.
Read Also:TECNO Pova 7 5G: ఇంత తక్కువ ధరకు అన్ని ప్రీమియం ఫీచర్లా.. కొత్త టెక్నో పోవా 7 5G విడుదల..!
ప్రాసెసర్:
TECNO POVA 7 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ 4nm చిప్‌సెట్, Mali-G615 GPU, 8GB LPDDR5 RAM (వర్చువల్ RAMతో కలిపి 16GB వరకు) తో వస్తుంది. స్టోరేజ్ పరంగా 128GB / 256GB UFS 2.2 స్టోరేజ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
కెమెరా:
POVA 7 Pro 5G ఫోన్ వెనుక భాగంలో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ముందు, వెనుక రెండింటితోనూ 4K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ:
ఈ కొత్త మొబైల్ లో 6000mAh సామర్థ్యమైన బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇది ఈ సెగ్మెంట్ లో మొదటిసారి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్ కావడం గమనార్హం.
Read Also:WI vs AUS: జోసెఫ్ దెబ్బ.. ఆసీస్ అబ్బా.. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
ఇక ఈ ఫోన్‌లో Ella AI ఆధారంగా AI కాల్ అసిస్టెంట్, మల్టీలాంగ్వేజ్ సపోర్ట్, వాయిస్ ప్రింట్ నాయిస్ సప్రెషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, IR సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆట్మాస్, IP64 రేటింగ్ (దుమ్ము, నీటి స్ప్లాష్‌కు నిరోధం) వంటి అదనపు ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్:
ఈ ఫోన్‌లో 104 మినీ LED లైట్లు ఉండే డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఇది మ్యూజిక్, వాల్యూమ్ మార్పు, నోటిఫికేషన్‌ల సమయంలో స్పందించేలా రూపొందించబడింది. ఇది టెక్నో అందించిన విభాగంలో మొదటి మల్టీఫంక్షనల్ లైట్ ఇంటర్‌ఫేస్ ఫోన్. డైనమిక్ గ్రే, నీయాన్ సయాన్, గీక్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
ధర:
* 8GB + 128GB మోడల్ ధర: రూ. 18,999 (ఆఫర్‌తో రూ.16,999).
* 8GB + 256GB మోడల్ ధర: రూ.19,999 (ఆఫర్‌తో రూ.17,999).
ఈ ఫోన్ జూలై 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా ఉన్నాయి.