గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్‌డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళుతుండగా బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోతున్న దృశ్యాలు వినాశకరమైనవి” అని రాసుకొచ్చారు. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన సమాచారం తెలుసుకున్నాము. “వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి, మద్దతు అందించడానికి మేము స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాము” అని బ్రిటిష్ హైకమిషన్ Xలో పోస్ట్ చేసింది.
Also Read:Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
ఈ ప్రమాదంలో బాధితులకు బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ సంతాపం తెలిపారు. “భారత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వార్త నన్ను తీవ్రంగా బాధించిందన్నారు. భారత్ లోని రష్యా రాయబారి ఈ ఘటన “హృదయ విదారకం” అని అన్నారు. బాధిత కుటుంబాలకు, భారత ప్రజలకు సానుభూతి తెలిపారు. “అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఫ్రాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో మేము మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము” అని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ తెలిపారు.
Also Read:Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, “ఈ దుఃఖ సమయంలో యూరప్ మీకు, భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది” అని అన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సర్, విమాన ప్రమాదం గురించి విని తాను “తీవ్ర బాధపడ్డాను” అని అన్నారు.
