రష్యా రాజధాని మాస్కోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ దగ్గర వేడి నీటి పైపు లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫస్ట్ ఒకరు చనిపోయినట్లు మేయర్ తెలిపాడు. కానీ మరో ముగ్గురు కూడా చనిపోయారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Read Also: Covid 19: చైనా తర్వాత ఇప్పుడు అమెరికా.. కోవిడ్ లాంటి మహమ్మారి వస్తోందని హెచ్చరిక
షాపింగ్ సెంటర్‌లో జరిగిన విషాదం మరో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాలకు, స్నేహితులకు మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రగాఢ సానుభూతిని టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయని, వారిలో తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చామని, ఒకరిని ఔట్ పేషెంట్ చికిత్స కోసం పంపించామని హెల్త్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్
మాస్కో మాల్ లో పైపు పగిలిన ఘటనపై రష్యా దర్యాప్తు కమిటీ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఇన్వెస్టిగేటివ్ కమిటీ మాస్కో విభాగం ప్రతినిధి యూలియా ఇవానోవా తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ క్రిమినల్ కోడ్ లోని ఆర్టికల్ 238లోని పార్ట్ 3 కింద నేరం ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. 2007లో ప్రారంభమైన వ్రెమెనా గోదా మాల్ లో 150కి పైగా స్టోర్లున్నాయి. అయితే, ఘటనపై గాయపడిన వారికి డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు