Road Accident: శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం, జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Read Also:Kannappa : కన్నప్ప ఓవర్సీస్ రివ్యూ..
ఈ ఘటనలో వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒక మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ఉగ్గినపాలెం నుంచి ఎలమంచిలి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. వ్యానులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో వెలికితీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also:Today Astrology: శుక్రవారం దినఫలాలు!