Extramarital Affair : వారిది అనోన్యంగా సాగిపోతున్న కాపురం. వారి దాంపత్యానికి నిదర్శనంగా పండండి ఇద్దరు పిల్లలు కలిగారు. అలాంటి కాపురంలో వివాహేతర సంబంధం చిక్కుపెట్టింది. భర్త వేరే మహిళతో చనువుగా ఉంటున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో వారి మధ్య గొడవలు తలెత్తాయి. భర్త తీరు మారడంతో భార్య నిలదీశారు. కోపోద్రిక్తుడు అయిన భర్త.. ఆమెపై సలసల మసులుతున్న సాంబార్ పోశాడు. ఈ ఘటన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాలోని కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్య స్వామి(40), పెరియనాయకి(30)కి కొన్నే్ళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆరోగ్యస్వామి జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మరో మహిళ పరిచయం అయ్యింది. ఆమెతో వివాహేతర బంధం ఏర్పడింది.
Read Also:NTR centenary celebrations: ఎమ్మెల్యేను బుల్లెట్ ఎక్కించుకున్న మాజీ మంత్రి
దాంతో ఆరోగ్య స్వామి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని భార్య గమనించింది. కొంత కాలం తరువాత ఆమెకు భర్త గుట్టు తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. ఆమె మాటలు వినకుండానే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గత శుక్రవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో పెరియనాయకి వంట చేస్తోంది. గొడవ ముదిరింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆరోగ్య స్వామి తన భార్యపై వేడి సాంబార్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. నొప్పిని భరించలేక గట్టిగా అరవడంతో చుట్టుపక్కల నివసించేవారు పరిగెత్తుకొచ్చారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ లో ముండియంబాక్కం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై తిరువెన్నెనల్లూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Read Also:Jharkhand : కట్నం తెస్తావా.. నీ వీడియోలు నెట్లో పెట్టాలా.. శాడిస్టు భర్త అరాచకం