Honda Shine 100 DX: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్‌లో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని రెండు కొత్త బైకులను పరిచయం చేసింది. వాటిలో ఒకటి షైన్ 100 DX కాగా, హోండా CB125 హార్నెట్ గా మరో బైక్ ను విడుదల చేశారు. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా ఉంచుకొని రూపొందించిన మోడల్ షైన్ 100 DX. ఈ బైక్‌ను అగస్టు 1 నుంచి బుకింగ్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర వివరాలు, డెలివరీలు వచ్చే నెలలో వెల్లడవుతాయి.
హోండా తన 25ఏళ్ల భారత ప్రయాణం సందర్భంగా షైన్ (Shine) సిరీస్‌లో కొత్త మోడల్ Shine 100 DX ను ప్రవేశపెట్టింది. ఇది ఆధునికత, శక్తివంతమైన ఫీచర్ల మేళవింపుగా రాబోతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వినియోగదారుల కోసం రూపొందించబడిన ఈ బైక్‌లో ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..
Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!

Shine 100 DX లో క్రోమ్ డిటెయిల్స్‌తో రీడిజైన్ చేసిన హెడ్ల్యాంప్ ఉండగా, ఫ్యూయల్ ట్యాంక్‌పై క్లాసిక్ హోండా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంది. స్టైలిష్ గ్రాఫిక్స్‌తో ఉన్న బాడీ ప్యానెల్స్, ఆల్-బ్లాక్ ఇంజిన్, గ్రాబ్ రైల్, క్రోమ్ మఫ్లర్ కవర్ బైక్‌ను ప్రీమియంగా చూపిస్తాయి. ఇది లుక్స్ పరంగా కూడా యువతను ఆకట్టుకునే విధంగా తయారైంది. అలాగే కంఫర్ట్, టెక్నాలజీ పరంగా కూడా Shine 100 DX బాగా కనిపిస్తుంది. ఇందులో పొడవైన సీటు ఉండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అలాగే డిజిటల్ LCD డిస్‌ప్లే ద్వారా రియల్ టైమ్ మైలేజ్, ఫ్యూయల్ రేంజ్, సర్వీస్ రిమైండర్‌ల సమాచారం పొందవచ్చు. భద్రత పరంగా బైక్ సైడ్ స్టాండ్ డౌన్‌గా ఉంటే ఇంజిన్ ఆపే స్మార్ట్ సేఫ్టీ ఫీచర్‌ను అందించింది.
Variety Thief: జగిత్యాలలో వెరైటీ దొంగ.. అతడి టార్గెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. Shine 100 DXలో 98.98cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఇది 5.43 Kw పవర్, 8.04 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా eSP టెక్నాలజీ ద్వారా మెరుగైన మైలేజ్, స్మూత్ రైడింగ్ లభిస్తుంది. ఈ బైక్ లోని 4-స్పీడ్ గేర్‌బాక్స్, 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం దీన్ని రోజువారీ అవసరాలకు అనుకూలంగా మారుస్తుంది. ఇది భారత రోడ్లకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్లు, డ్రమ్ బ్రేక్‌లు, CBS బ్రేకింగ్ సిస్టమ్ బైక్‌కి మెరుగైన స్థాయిని కలిగిస్తాయి. ఇందులోని 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అన్నింటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. Shine 100 DX బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతుంది.
