ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్’ ( Hon Hai Fox Conn) సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభ్యం కానున్నది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. వొకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది.
Also Read : Virupaksha Teaser: చేతబడులను ఆపడానికి బయల్దేరిన మెగా మేనల్లుడు
యంగ్ ల్యూ’ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీ కి అందచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం.. ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిథి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సిఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో… రాష్ట్ర ఐటి మురియు పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.
Also Read : First Night Video: హయ్ ఫ్రెండ్స్.. మా ఫస్ట్ నైట్ వీడియో షేర్ చేస్తున్నా.. లైక్ చేయండి