హోంమంత్రి అనిత ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి 21 మంది సీఎం లను చూశాం. కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే టక్కున చంద్రబాబు గుర్తొస్తారు.. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పని చేస్తారు.. 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ప్రయాణంలో సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ నెలలోనే అన్నదాత సుఖిభవ..స్త్రీ శక్తి పథకాలను ప్రారంభించాము.. ఈ 14 నెలల్లో ఏపీలో సంక్షేమం.. అభివృద్ధి పై మాత్రమే ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. వాస్తవాలు ఉంటే ప్రచారం చెయ్యవచ్చు.. అవాస్తవాలను చూపించి.. మీడియా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు.
Also Read:Dharma Mahesh: టాలీవుడ్ హీరోపై వరకట్నం కేసు?
అబద్ధాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి.. కొరడా ఝుళిపించాలి.. అమరావతి మునిగింది అని దుష్ప్రచారం చేస్తున్నారు.. సచివలయం ఏమైనా మునిగి పోయిందా.. పునాది సమయంలో కొన్ని నీరు చేరతాయి.. పునాదుల్లో నీళ్లు లేక ఏమొస్తాయి.. ఒక రకమైన నెగెటివ్ యాంగిల్ లో అమరావతిని ప్రొజెక్ట్ చేశారు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అందిస్తే రాజద్రోహం కేసు పెట్టాలి.. ప్రకాశం బ్యారేజ్ గేట్ విరిగిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. జాతీయ జెండాకు స్వాతంత్ర్య దినోత్సవానికి విలువ ఇవ్వలేని వ్యక్తి జగన్ ఈ రకంగా వ్యవహరిస్తూన్నారు..
Also Read:YS Viveka Murder Case: సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. ఆ కేసులు క్వాష్..
వాస్తవాలు…వాస్తవాలుగా చూపించాలి.. సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టించి రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తే.. చర్యలు ఉంటాయి.. సోషల్ మీడియాలో వాస్తవాలు..అవాస్తవాలుగా చిత్రీకరణ చేస్తే ప్రత్యేక చట్టం తెస్తాం.. కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరిస్తూన్నారు.. మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. సీఎం కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు.. మంత్రి దగ్గరకు ప్రజా ప్రతినిధులు వస్తారు..
Also Read:Tejashwi Yadav: 2029లో రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం
పెరోల్ ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ కు మంచి వ్యవహార శైలి లేని కారణంగా పెరోల్ రద్దు చేసాము.. జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం లో అలాంటి ఆటలు సాగవు.. ఇటువంటి అసాంఘిక శక్తుల ఆటలు సాగవు.. పెరోల్ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.. ఒక పక్క సోషల్ మీడియా..దుష్ప్రచారం… మరోవైపు అభివృద్ధి ఇలా అన్ని అంశాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం.. ఎన్డీయే కూటమి తప్పు చేసిన వారిని వదిలి పెట్టదు అని వెల్లడించారు.