GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పోలింగ్ శాతం 78.57 గా నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నిరాటంకంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు నమోదు అయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగి సాయంత్రం 4 గంటలకు…
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం లభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
పద్దెనిమిదవ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 16 శాతం మంది జాతీయ పార్టీలు, ఆరు శాతం మంది రాష్ట్ర స్థాయి పార్టీలు, 47 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు. ఈ సమాచారం 'పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్' నివేదికలో ఇవ్వబడింది.
ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 17 నుంచి 26 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరంలో గల ఈవీఎంలు భద్రత పరిచిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నో మేన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ యూనివర్సిటీ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. ఈ క్రమంలో స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల వద్దు బందోబస్తుగా ఉన్నారు.
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడెవరో ఈ రోజు తేలనుంది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీయేతర కుటుంబ నుంచి అధ్యక్షుడు రాబోతున్నారు. అక్టోబర్ 17న జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి దేశంలో పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు చేరాయి. అక్కడకు తరలించిన వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
హుజురాబాద్, బద్వేల్‌తో పాటు ఇవాళ దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ…
మే 2 న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్…