Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొగోయ్ భార్యకు పాకిస్థాన్‌లో చాలా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ భార్య ఎలిజబెత్‌కు పాకిస్తాన్లో ఒకటి కాదు రెండు కాదు అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని హిమంత ఆరోపించారు. ‘‘ గౌరవ్ గొగోయ్, ఆయన కుటుంబానికి పాక్‌లో ఎన్ని బ్యాంక్ ఖతాలు ఉన్నాయో అడగగలరా.? ఈ రోజు వరకు ఆయన కుటుంబ ఖాతాలు పాక్‌లో నడుస్తున్నాయి. నేను దీనిపై ఈ నెల 8న మాట్లాడుతాను’’ అని ఆయన అన్నారు.
Read Also: Bhatti Vikramarka : మహాత్మా గాంధీ ఏ పాపం చేశారని ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించారు
పాకిస్తాన్లో బ్యాంక్ ఖాతాలు ఉన్న వ్యక్తి ఉంత ప్రమాదమో ఊహించుకోండని ప్రజలకు సూచించారు. అస్సాంలో కాంగ్రెస్ కార్యాలయం అస్సాం, దేశ వ్యతిరేక మనస్తత్వానికి కేంద్రంగా మారిందని అన్నారు. గతంలో కూడా అస్సాం సీఎం గౌరవ్ గొగోయ్‌ని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పలు మార్లు పాకిస్తాన్ వెళ్లారని, ఆయన భార్య పాక్ ఐఎస్ఐ పేరోల్‌లో ఉన్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత ఖండించారు.