Game zone fire: వీడియో గేమ్ జోన్ అగ్ని ప్రమాదంపై హైకోర్టు ఫైర్.. మున్సిపల్ అధికారులకు చివాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది. ఈ ఘటనపై నేపథ్యంలో స్థానిక మునిసిపల్ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసీ) అధికారులపై ఫైరయ్యింది. ‘‘భవనం మీ పరిధిలో ఉందని తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్ సేఫ్టీ లేకుండా రెండున్నరేళ్లుగా రన్ చేస్తున్నారని ఎలా చెబుతారు. టికెట్ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా?’’ అని జస్టిస్ బైరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
READ MORE: Tamannah: అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాగా.. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నట్లు మీడియా కథనాలను వెలువడ్డాయి. వాటిని చూపిస్తూ.. ఆ అధికారులు ఎవరు? వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా? అని ప్రశ్నించారు. ఆ గేమ్ జోన్ ఏర్పాటైనప్పటి (2021) నుంచి ఈ ప్రమాదం జరిగినంతవరకు రాజ్‌కోట్ కమిషనర్లుగా పనిచేసినవారంతా ఈ విషాదానికి బాధ్యత వహించాల్సిందేనని అని పేర్కొంది. వారంతా వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనుమతుల కోసం టీఆర్‌పీ గేమ్ జోన్ తమను సంప్రదించలేదంటూ ఆర్‌ఎంసీ తరఫు న్యాయవాది వివరించే సమయంలో హైకోర్టు ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసేందుకు ప్రభుత్వం ముందుకురావాలని, అప్పుడే కఠిన చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. పిటిషనర్ చేసిన విన్నపంపై ధర్మాసనం స్పందిస్తూ..కఠిన చర్యలు ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. తాము ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారని తెలిపింది. ప్రాణాలు కోల్పోవడాన్నే వాళ్లు కోరుకుంటారని మండిపడింది. ఆ తర్వాత యంత్రాంగాన్ని పురమాయిస్తారంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఓ పిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చేశారు.అని అడిగింది. హైకోర్టు ఈ కేసుపై తీవ్రంగా స్పందించింది.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!