టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న . నాని 30వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.అలాగే ఈ సినిమా సక్సెస్‌లో హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హాయ్ నాన్న మూవీ తో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.. థియేటర్లలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్న హాయ్ నాన్న ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది.
జనవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ కంటే ఏ మాత్రం తగ్గకుండా ఓటీటీలో కూడా ప్రేక్షకుల నుంచి స్పందన ఉంటుందని నాని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని సమాచారం.ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో అని మూవీ లవర్స్‌ఎదురుచూస్తున్నారు. హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో మరియు సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో కీ రోల్ పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి,డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్ తెరకెక్కించారు.
#HiNanna streaming from tonight 12am on #Netflix#Nani #MrunalThakur #BabyKiara pic.twitter.com/Ep1x5HkZgC
— Telugu TV Updates (@telugutvupdts) January 3, 2024