తన వివాహం గురించి వస్తున్న పుకార్ల గురించి తాజాగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ లో హీరోయిన్ అంజలి స్పందించింది. ఇప్పటికే తనకు నాలుగైదు సార్లు పెళ్లి చేసేసారు కాబట్టి., ఇంట్లో వాళ్లకి పెళ్లి వార్తలు మీద నమ్మకం పోయిందని తాను ఎవరినైనా అబ్బాయిని తీసుకువెళ్లి చూపిస్తే తప్ప వాళ్ళు నమ్మే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ.. కానీ., ఇప్పుడు తనకు కనీసం తన పెంపుడు కుక్కతో బయటకు వెళ్లే సమయం కూడా లేదని అంత బిజీ బిజీగా షూటింగ్స్ లో గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
Rajnath Singh: భారత రాజ్యాంగాన్ని ఎప్పటికీ బీజేపీ మార్చదు.. సవరణలు చేస్తాం..!
పెళ్లి అనేది ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ అని., తాను ప్రస్తుతానికి నటనకు మాత్రమే 100% టైం ఇవ్వగలనని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు 100% నటనకు మాత్రమే కేటాయిస్తున్నాను. పెళ్లయిన తర్వాత భర్తకి కూడా కేటాయించాలి కాబట్టి ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదు.. కానీ., ఇంట్లో వాళ్ళకు మాత్రం నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చింది.