Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan : యంగ్ హీరో సందీప్‌కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఊరిపేరు భైరవకోన’, రాయన్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న సందీప్ ఈ మూవీలు ఇచ్చిన సక్సెస్‌తో మూడు ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశాడు. ఇందులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే డైరెక్షన్లో ‘వైబ్’ అనే సినిమా చేస్తున్న సందీప్.. ‘ధమాకా’ మూవీతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇవి కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సందీప్ పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
Read Also:Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కంటెంట్ ఉండే విధంగా సందీప్ జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఆయన నుండి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతుండడంతో మేకర్స్ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే, తాజాగా తన కన్నతల్లికి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ఈ హీరో. త్వరలోనే తన తల్లి కనకదుర్గ పుట్టినరోజు వస్తున్న క్రమంలో ఆమెకు బర్త్ డే గిఫ్ట్‌గా ఈ కారును కొనిచ్చినట్లుగా తెలుస్తోంది. సందీప్ కిషన్ తన ఇన్‌స్టో అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన తల్లి ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తుందని.. ఆమెకు కొడుకుగా ఎప్పటినుండో ఓ కారును కొనివ్వాలని చూశానని… ఇప్పుడు ఆ తరుణం రావడంతో ఆమెకు ఈ కారును బహుమతిగా ఇస్తున్నానని సందీప్ తన పోస్ట్‌లో తెలిపాడు. ఇలాంటి లక్ష్యాలు ఎనలేని సంతోషాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.
Read Also:Success Story: రూ.8 లక్షలతో స్టార్టప్.. ప్రస్తుతం రూ.23,567 కోట్ల బిజినెస్.. విజయ రహస్యం?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..