Naveen Polishetty Injury: హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు.. చాలా కష్టంగా ఉందంటూ..!
- నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు
- భరించలేనంతగా నొప్పి
- ఇట్లు మీ జానేజిగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Naveen Polishetty Injury Update: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి చేయి, కాలికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం భరించలేనంతగా నొప్పి ఉందని, గాయాల కారణంగా అనుకున్నంత వేగంగా తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేనని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తన ప్రమాదం గురించి నవీన్ పోలిశెట్టి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘నా లైఫ్ అప్డేట్ను మీతో పంచుకోవానుకుంటున్నా. అనుకోకుండా నా కుడి చేతికి ఫ్యాక్చర్ అయింది. నా కాలుకు కూడా గాయమైంది. ప్రస్తుతం నొప్పి భరించలేనంతగా ఉంది. పూర్తిగా కోలుకునే దిశగా కృషి చేస్తున్నాను. మీ మద్దతు, ప్రేమ మాత్రమే నాకు ఇప్పుడు పెద్ద మెడిసిన్. గాయాల కారణంగా మీరు అనుకున్నంత వేగంగా నా సినిమాలు తీసుకురాలేను. కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. రికవరీ అయ్యేందుకు వైద్య నిపుణుల సలహాలు తీసుకుంటున్నా. నేను మునుపెన్నడూ లేనంత బలంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని డిసైడ్ అయ్యాను’ అని ఎక్స్‌లో నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
Also Read: Amazon Prime Day Sale 2024: అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు.. కాంబో డీల్స్ కూడా!
‘గుడ్ న్యూస్ ఏమిటంటే.. నా తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాను. డెవలప్మెంట్ వర్క్ త్వరగా జరుగుతోంది. రికవరీ అయిన వెంటనే వాటిని మొదలుపెడతా. దయచేసి నా గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు. నా నుండి వచ్చే అప్డేట్లను మాత్రమే విశ్వసించండి. ఎప్పటిలాగే మీ ప్రోత్సాహం, ప్రేమ నాపై ఉన్నందుకు ధన్యవాదాలు. నేను మళ్లీ తెరపై మిమ్మల్ని అలరించడానికి వేచి చూస్తున్నా. ఎప్పటిలాగే ప్రేమను కురిపించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇట్లు మీ జానేజిగర్’ అని నవీన్ పోలిశెట్టి రాసుకొచ్చాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో నవీన్ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు.
Life update. Have unfortunately suffered severe multiple fractures in my hand 💔 and injured my leg too 🙁 It’s been very tough but working towards full recovery so I can perform at my energetic best for you. Your support, patience and love is the only medicine I need ❤️… pic.twitter.com/IY0cYiAuDU
— Naveen Polishetty (@NaveenPolishety) July 17, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!