Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ డెలివరీకి, మాస్ మేనరిజమ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటివరకు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన పవర్ఫుల్ వాయిస్‌తో అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు బాలయ్య. మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “Don’t Trouble the Trouble”. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని డైలాగ్ నే ఫహద్ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్రంలో కథలోని కీలక సన్నివేశాలకు, నేరేషన్‌కు బాలకృష్ణ తన వాయిస్ ఓవర్ అందించారు. బాలయ్య చెప్పిన వాయిస్ ఓవర్ కథనానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. డబ్బులు, ట్రబుల్స్ తో ట్రావెల్ అయ్యే హీరో లైఫ్ లోకి వచ్చిన ఓ పాప వచ్చిన తర్వాత అతని లైఫ్ లో ఎలాంటి మ్యాజిక్ జరిగిందనే కాన్సెప్ట్ తో వస్తోంది Don’t Trouble the Trouble. ప్రొడక్షన్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ విలక్షణ చిత్రాన్ని శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజమౌళి మరియు కార్తికేయల కోసమే బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!