Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హయత్ నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది.
Gachibowli: హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Heavy Rain Alert for Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి.. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది..
Hyderabad: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గకపోవడంతో జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. Read Also: CM Revanth Reddy: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రేపు ఘటనా స్థలం సందర్శన ఈ నేపథ్యంలో…
రోజుల తరబడి చలిగాలులు వీచిన హైదరాబాద్‌లో మంగళవారం మార్పు చోటు చేసుకుంది. హైదరాబాద్ తో పాటు పక్క జిల్లాల్లో మంగళవారం రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అయితే ఆశించిన పరిధి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అది 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గలేదు. మంగళవారం తెల్లవారుజామున శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌తో సహా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణ…
గులాబీ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కు అతి భారీ వర్షం ముప్పు తప్పిందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది. జీహెచ్ఎంసి పరిధిలో అక్కడక్కడా తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. అయితే ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. ఈ రాత్రికి ఒక మోస్తరు వర్షం… దఫా దఫాలుగా కురిసే…