Heavy Rains in AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది.. అల్లూరి జిల్లాలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాపరాయి, డుడుమ, సరియ టూరిజం కేంద్రాలను యంత్రాంగం తాత్కాలికంగా మూసి వేశారు అధికారులు… అటు, విశాఖ తీరం అలజడిగా మారింది. సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం పెద్ద ఎత్తున కోతకు గురి అవుతోంది.
Read Also: Filmnagar Jewellery : ఫిలిం నగర్‌లో నగల మిస్టరీ..! మాణిక్ జ్యూవెలర్స్ మోసపు రహస్యం..!
శ్రీకాకుళం పట్టణంలో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.. రహదారుల పైన వర్షపునీరు నిలిచిపోయింది.. వాహనదారులపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.. ఆర్టీసీ కాంప్లెక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు నీటమునిగాయి.. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు పూర్తిగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు.. అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్.
Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
ఇక, బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన ఆమె.. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉండాలని సూచించారు.. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు హోంమంత్రి అనిత.
