Cyclone Mentha Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు…
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఈ రోజు ఇప్పటికే గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.