ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని…
Minister Seethakka : తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు (DWOs) పాల్గొన్నారు. సీతక్క పేర్కొన్నట్టుగా, “పోషకాహార తెలంగాణే మన లక్ష్యం. అందుకు అంగన్‌వాడీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి.” రాష్ట్రంలో 313 అంగన్‌వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడాన్ని తప్పుపడుతూ, చిన్నారులు లేరనే సాకుతో…
పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి.
అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64, 445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ప్రస్తుతం…