Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు, టూరిజం కేంద్రాలు మూత..!
- ఉపరితల ఆవర్తనం ప్రభావం..
- ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు..
- మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం..
- శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని స్కూళ్లకు సెలవు..
- అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..
- చాపరాయి, డుడుమ, సరియ టూరిజం కేంద్రాలు మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది.. అల్లూరి జిల్లాలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాపరాయి, డుడుమ, సరియ టూరిజం కేంద్రాలను యంత్రాంగం తాత్కాలికంగా మూసి వేశారు అధికారులు… అటు, విశాఖ తీరం అలజడిగా మారింది. సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం పెద్ద ఎత్తున కోతకు గురి అవుతోంది.
Read Also: Filmnagar Jewellery : ఫిలిం నగర్‌లో నగల మిస్టరీ..! మాణిక్ జ్యూవెలర్స్ మోసపు రహస్యం..!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
శ్రీకాకుళం పట్టణంలో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.. రహదారుల పైన వర్షపునీరు నిలిచిపోయింది.. వాహనదారులపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.. ఆర్టీసీ కాంప్లెక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు నీటమునిగాయి.. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు పూర్తిగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు.. అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్.
Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
ఇక, బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన ఆమె.. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉండాలని సూచించారు.. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు హోంమంత్రి అనిత.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!