Heavy Rains: నాగ్‌పూర్‌లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లోకి నీరు చేరింది. దాంతో పాటు సిటీ బస్ డిపోలో పార్క్ చేసిన కొన్ని బస్సులు మునిగిపోయాయి. అంబజారి సరస్సు పొంగిపొర్లడంతో పలు ఇళ్లలోకి కూడా నీరు చేరింది.
Posani: పురంధేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
జాతీయ విపత్తు ప్రతిస్పందన (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు వరదల్లో చిక్కుకున్న ఇళ్లు, వీధుల నుండి ప్రజలను రక్షిస్తున్నారు. రెండు యూనిట్లు లోతట్టు ప్రాంతాల నుండి నివాసితులను SDRF బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. ఇప్పటి వరకు 140 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అంతేకాకుండా వినికిడి, మాట్లాడలేని 40 మంది పిల్లలను ఓ పాఠశాల నుండి రక్షించినట్లు ఆయన పేర్కొన్నారు.
Nabha Natesh: శారీ పిక్స్ తో మనుసు దోచుకుంటున్న నభా నటేష్
మరోవైపు అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు. మరోవైపు భండారా, గోండియా జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా.. నేడు అమరావతి, యవత్మాల్, గడ్చిరోలిలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నాగ్‌పూర్, నాసిక్, థానేతో సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల వరదలు, వరదలు తలెత్తే పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ ఇప్పటికే భారీ వర్షం హెచ్చరిక జారీ చేసినందున, వర్షం ప్రారంభమైన వెంటనే రెస్క్యూ ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!