తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. తాజాగా ఆదివారం సాయంత్రం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో చల్లని గాలులతో నగర వాసులు ఉపశమనం పొందారు. అయితే.. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా.. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అయితే.. వర్షం కారణంగా కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Also Read : Rs.2000 Notes Withdrawal: రూ.2000 నోట్ల ఉపసంహరణపై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు..!
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, మియాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎబ్బీనగర్, నాగోల్, ఉప్పల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణ గూడ, ఖైరతాబాద్, అఫ్జల్ గంజ్, గోశామహల్, ఏంజే మార్కెట్ వర్షం పడింది. గంటపాటు ఉరుములు, మొరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.
Also Read : Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదేనా..? రైల్వే రిపోర్ట్..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో మరో నాలుగు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.