Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
  • వచ్చి చేరుతున్న లక్షా 50 వేల క్యూసెక్కుల వరదప్రవాహం
Srisailam Project

Srisailam Project

Srisailam Project: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి లక్షా 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 1,50,900 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఔట్‌ ఫ్లో నిల్‌గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 840.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 62.0510 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఇంకా రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.

Read Also: Andhra Pradesh: టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ