GANJA: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
- భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
- కోటి రూపాయల విలువచేసే గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
- నిజామాబాద్ కార్పొరేటర్ కుమారుని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు
- గత పది సంవత్సరాల నుంచి గంజాయి బిజినెస్ చేస్తున్న కార్పొరేటర్ కుమారుడు మునవర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడు మహమ్మద్ మునవర్ అలీ ప్రధాన నిందితుడు కావడం విశేషం.
Read Also: Musi River: మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
గత కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోలీసులు కన్నుగప్పి గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన 319 కేజీల గంజాయిని మరియు రెండు కార్లు, రెండు బైకులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణాలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడైన మునావర్ ఆలీతో పాటు మరో కుటుంబం పూర్తిగా గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల అరుణ, ఆమె కుమారుడు నేరెళ్ల అఖిల్ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తల్లీ కొడుకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడడం విశేషం. నేరెళ్ల అరుణ భర్త కూడా సదయ్య గంజాయి వ్యాపారం చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
Read Also: Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
అయితే ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేకసార్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ మునావర్ అలీ.. వీరితో చేతులు కలిపి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు వీరిని భద్రాచలం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమని ఇలా పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే సమాజ హితం కోసం ఎవరు కూడా మత్తు పదార్థాలు అలవాటు కావద్దని.. ముఖ్యంగా మత్తు పదార్థాలు అలవాటు పడిన యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని పేర్కొన్నారు. అత్యంత చాకచక్యంగా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఆట కట్టించిన భద్రాచలం ఎక్సైజ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!