Education: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దయిన విషయం అందరికి సుపరిచతమే. ఈ నేపథ్యంలో అటు అభ్యర్ధులు ఇటు TSPSC కమిషన్ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే రెండుసార్లు నిర్వహించగా అభ్యర్థులు ఈ పరీక్షను రాసారు. ఈ నేపథ్యంలో మూడవసారి కూడా రాయాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అంతేకాదు అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతారని ఈ పరీక్ష రద్దు పైన మళ్ళీ విచారణ జరపాలి అని హైకోర్టుకి సెప్టెంబర్ 25 అప్పీల్ చేసింది TSPSC కమిషన్. ఈ విషయం పైన అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. కాగా అందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగనుంది. కాగా ఈ విషయం పైన ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరిలో ఉత్కంఠత నెలకొంది.
Read also:Mineral water: మినరల్ వాటర్ వేడి చేసి తాగవచ్చా?
పరీక్ష నిర్వాహణలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు అభ్యర్థుల మనవిని అంగీకరిస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. కాగా ఇప్పుడు ఈ విషయం పైన తిరిగి విచారణ జరుపుతున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తారా? లేక చెయ్యరా? అని అందరిలో ఆందోళన కలుగుతుంది. కొందరు అభ్యర్థులు ఈ పరీక్షను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు మరియు TSPSC కమిషన్ ఈ పరీక్ష రద్దు చేయొద్దని కోరుకుంటుంది. ఇంత సున్నితమైన విషయం పైన కోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందో అనేది ప్రస్తుతం అందరిలో ఉండే సందేహం. పరీక్ష రద్దు కావాలని కొందరు. రద్దు కాకూడదు అని మరికొందరు. ఎవరి ఆశ నెరవేరుతుందో చూడాలి.