గ్రూప్ 1 పిటీషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాలు పున:మూల్యాంకనం చేయాలని పిటీషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల లాయర్లు మెయిన్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటున్నారు. పిటీషన్లపై ఈ రోజు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది. ఏప్రిల్‌లో జరిగిన విచారణ సందర్బంగా గ్రూప్1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు గ్రూప్1కు ఎంపికైన అభ్యర్థులు. మెయిన్స్ పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.