బిర్యాని ఆకులు వేస్తేనే బిర్యానికి ఆ రుచి వస్తుంది.. అయితే బిర్యానికి సువాసనలు, రుచి ఇవ్వడం తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా వ్యాధులను నయం చేస్తుందట.. మరి ఈ ఆకులను ఎలా తీసుకోవాలి.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వీటితో టీ ని తయారు చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులో పోసుకుని గోరు వెచ్చగా తాగాలి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో చూడండి.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ టీ ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా బిర్యానీ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.. రక్తంలో మలినాలను కూడా ఈ టీ శుద్ధి చేస్తుంది.. చర్మ , జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు..
ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.. మహిళలకు నెలసరి నొప్పులు ఉండవు..ఇకపోతే వీటిలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని వాడడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.. అలాగే యాక్టివ్ గా కూడా ఉంటామని నిపుణులు అంటున్నారు.. రోజుకు ఒకసారి తీసుకోవడం మంచిది.. ఈ టీ తీసుకున్నాక అరగంట వరకు ఎటువంటి ఫుడ్ ను తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు..