నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య చికెన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో జనాలు చికెన్ ను తినాలా వద్దా అనే అపోహలో ఉండిపోతున్నారు.. తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలను చెప్పారు. నిజంగా వాళ్లు చెప్పింది వింటే ఇక చికెన్ ను తినడమే మానేస్తారు.. అదేంటో ఒకసారి చూద్దాం..
మనం చికెన్ ను తీసుకురాగానే బాగా శుభ్రంగా కడుగుతాము.. అయితే అలా అస్సలు చెయ్యొద్దంటున్నారు నిపుణులు.. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు.. కడగకుండా ఎలా వండుతారు.. వాటిపై దోమలు, దుమ్ము దూళి ఇలా ఎన్నో వాలి ఉంటాయి కదా అనే సందేహం రావొచ్చు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. చికెన్‌ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్‌ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్‌ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు.
ఎందుకంటే.. చికెన్ లో ప్రమాదకర క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు.. ఇక ఇవి పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు.. అందుకే కడిగి అస్సలు వండొద్దని హెచ్చరిస్తున్నారు.. చికెన్ ను డైరెక్ట్ గా ఉడికించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.. నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్‌ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని పరిశోధకులు తెలుపుతున్నారు.. సో ఫ్రెండ్స్ చికెన్ ను కడిగే ముందు ఆలోచించండి..