Pani Puri: పానీపూరి అనేది చాలామందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే మరింత ఇష్టం. ఇది ఎంతో రుచికరమైనది. అయితే, అందరూ అనుకునే విధంగా వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి పానీపూరి తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం.
Also Read: BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బిగ్ షాక్.. వారితో స్టేయింగ్ టైం కుదింపు..?
* పానీపూరిలో పుదీనా, జీలకర్ర వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమై, జీర్ణ సంబంధిత సమస్యలు తొలిగిపోతాయి.
* పానీపూరీలో పుష్కలంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శక్తి పెరిగిన తర్వాత, మీరు మీ పనులను ఉత్తేజంగా పూర్తి చేయగలుగుతారు.
* పానీపూరీలో ఉండే బంగాళాదుంపలు, శనగలు విటమిన్లు ఇంకా ఖనిజాలను అందిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలు అందించి, శక్తిని పెంచుతుంది.
* పానీపూరిలో నోటిపూతను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మసాలా పదార్థాలు నోటి పూతలను తగ్గించడానికి సహాయపడతాయి.
* పుదీనా, జీలకర్ర వంటి పదార్థాలు మనస్సును ఉత్తేజితం చేస్తాయి. ఇవి మనసును శాంతిగా ఉంచి, మంచి ప్రొడక్టివిటీని అందించడంలో సహాయపడతాయి.
Also Read: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ఇలా అనేక ప్రయోజనాలున్న పానీపూరిని తినడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. పానీపూరి తినేటప్పుడు, అది స్వచ్ఛమైన పరిసరాలలో తయారైనదిగా చూసుకోవాలి. వాటి కోసం ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి. అధికంగా పానీపూరి తినడం ఆరోగ్యానికి హానికరమవుతుంది.. కాబట్టి, పరిమితంగా తినడం మంచిది. జీర్ణ సమస్యలు ఉన్న వారు వైద్యుడిని సంప్రదించాలి. మొత్తానికి పానీపూరి రుచికరమైనది మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పరిశుభ్ర వాతావరణంలో మితంగా తినాలి.