Headmaster beaten up: టీచర్ అంటే ఏం చేయాలి? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలుసా? చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం ప్రాంతంలో గల జిల్లా ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల ప్రధానోపాధ్యాయుడు షాజహాన్ అసభ్యంగా ప్రవర్తించాడు. హెడ్మాస్టర్ ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన బాలిక బంధువులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రధానోపాధ్యాయుడిని ఆస్పత్రికి తరలించారు.
Two Tigers: తడోబా అంధారి రిజర్వ్‌లో 24 గంటల్లో 2 పులులు మృతి
మరోవైపు ప్రధానోపాధ్యాయుడు షాజషాన్ తనపై వచ్చిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించాను అన్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. ఏ కారణంగా వాళ్ళు తనపై ఆరోపణ చేస్తున్నారన్నది విచారణలో తేలుతుందన్నారు. తన గురించి తాను పని చేస్తున్న స్కూల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో అడగండి అంటూ వెల్లడించారు. అప్పుడు నిజాలు తెలుస్తాయన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.