ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ టికెట్ల విక్రయంపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.