Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర గర్భగుడిని చూశారా?.. రామయ్య కొలువుదీరేది ఇక్కడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలపై శిల్పాలు కనబడతాయి. కళాకారులు ప్రస్తుతం స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. కళాకారులు పూర్తి ఏకాగ్రతతో స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. ఆలయ ప్రారంభం కోసం రోజులు దగ్గర పడుతుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ఆలయ కమిటీ చెబుతుంది.
Read Also: Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
అయోధ్యలో నిర్మించే రామమందిరాన్ని ప్రత్యేక రాళ్లతో నిర్మిస్తున్నారు. ప్రతి రాయిపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఇక్కడి అద్భుతమైన కళాకారులు ఈ రాళ్లకు ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన అనిల్ మిశ్రా.. ప్రతి రాయిపై ఇలాంటి శిల్పాలు చెక్కడం చూడదగినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రాలను చూసేందుకు రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించార. అయితే, ఈ రామమందిర స్తంభాలపై పలు చోట్ల నిర్మాణంలో కాషాయ జెండా కూడా కనిపిస్తుంది. రాంలాలా స్వామి నివసించే గర్భగుడి ఇది.. ఈ గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు ఉంటుంది.
Read Also: PV Sindhu: షట్లర్ మహ్మద్ హఫీజ్ హషీమ్‌ను తన కొత్త కోచ్‌గా ప్రకటించిన పివీ సింధు..
ఆలయం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు పింక్ ఇసుకరాయితో తయారు చేశారు. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు. ఈ స్తంభాలపై నర్తకి, హనుమంతుడు, వానర్ సేన , శివుని విగ్రహాలు చెక్కబడ్డాయని కళాకారులు తెలిపారు. ఈ చిత్రాలలో నిలబడి ఉన్న భారీ స్తంభాలను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ స్తంభాల గుండా వెళ్లే రహదారి కూడా కనబడుతుంది. గర్భగుడి చుట్టూ నిర్మించిన వృత్తాకార మార్గం.. రాంలాలా ఈ గర్భగుడిలో కూర్చున్న తర్వాత, రామ భక్తులు ఈ మార్గం గుండా రాముడిని దర్శించుకుంటారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!