Scheduled Castes Reservations: హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా రిజర్వ్ చేస్తామన్నారు. చండీగఢ్ లో విలేకరుల సమావేశంలో సైనీ మాట్లాడుతూ.., హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడుతుందని.. ఈ కోటాలో 10% అణగారిన షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
Cholesterol Reduce: వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుందంటే..?
భారత ఎన్నికల సంఘం అందించిన ప్రవర్తనా నియమావళికి కట్టుబడి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తామని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అక్టోబరు 1న ఒకే దశలో హర్యానాలో ఓటింగ్ జరగనుండగా.., అక్టోబర్ 4న కౌంటింగ్ జరగనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికలకు సిద్ధంగా ఉందని రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కాన్ఫరెన్స్ సందర్భంగా సైనీ పేర్కొన్నారు.
Dengue Fever: డెంగ్యూ రాకూండా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించామని, దానిని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ అన్నారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. హర్యానాలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. గత 10 ఏళ్లలో హర్యానాను ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేశాం. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు సాధించిన విజయాలపై దృష్టి సారించాలి. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
రాష్ట్రంలో జూదం, బెట్టింగ్ లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యాంబ్లింగ్ నిరోధక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని సైనీ తెలిపారు. ఈ ఆర్డినెన్స్ కింద దోషులుగా తేలిన వారికి ఏడేళ్ల వరకు జైలు లేదా రూ.7 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. హన్సిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి సైనీ మాట్లాడుతూ., బిజెపి అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ మీ మద్దతు మూడోసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాకు సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నానని., అవినీతిపరులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నని.. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో హర్యానని మార్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాల్లో భారీ పెరుగుదల.?
కాంగ్రెస్ మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా స్టాప్ రిక్రూట్మెంట్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారని.. ప్రతి రిక్రూట్మెంట్ ను కోర్టుకు తీసుకెళ్లడం ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారని సైనీ ఆరోపించారు. ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా పేద తల్లుల పిల్లలకు ఉపాధి కల్పించిందని., 20 లక్షల యూత్ స్కిల్ ఎంప్లాయ్‌మెంట్ కార్పొరేషన్ కింద హర్యానాలో 1.5 కోట్ల మందికి జీవితకాల ఉపాధిని కల్పించిందని సైనీ ముగించారు.