8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమీషన్ అమలవుతుంది కాబట్టి, ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2026 జనవరి 1 నుండి 8వ పే కమిషన్‌ను అమలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో కనీస వేతనం, పెన్షన్‌లో పెను మార్పులు వస్తాయని భావిస్తున్నారు.
WI vs SA: సొంతగడ్డపై తేలిపోయిన విండీస్.. సిరీస్ గెలిచిన సఫారీలు..
అయితే, 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుందని పేర్కొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్లలో ఈసారి కొత్త వేతన సంఘం అమలు అవుతుందా లేదా అన్న ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా.. ఈ పనులకు ఇంకా సమయం సరిపోతుందని చెప్పారు.
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవా టికెట్లు విడుదల!
6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారిన సందర్భంగా.. వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3.68గా ఉంచాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయగా, ప్రభుత్వం దానిని 2.57గా ఉంచింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సాయంతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 7000 నుంచి రూ. 18వేలకు పెంచారు. దీంతోపాటు కనీస పెన్షన్ కూడా రూ. 3500 నుంచి రూ. 9000కి పెరిగింది. పని చేసే ఉద్యోగుల గరిష్ట వేతనం రూ. 2.50 లక్షలు కాగా, గరిష్ట పెన్షన్ కూడా రూ. 1.25 లక్షలుగా మారింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ ఆమోదం పొందితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92కు పెంచవచ్చు. దీని సహాయంతో దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 34,560కి పెరగడంతో పాటు కనీస పెన్షన్ రూ. 17,280కి చేరుకోవచ్చు. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది చాలా ఊరటనిస్తుంది.