Haryana Cabinet portfolios: హర్యానా ముఖ్యమంత్రిగా నవంబర్ 17న నాయిబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది నేతలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్, మహిపాల్ ధండా, విపుల్ గోయల్, అరవింద్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణవీర్ గాంగ్వా, కృష్ణ బేడీ, శృతి చౌదరి, ఆర్తీ సింగ్ రావ్, రాజేష్ నగర్, గౌరవ్ గౌతమ్ లు ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆదివారం (అక్టోబర్ 21) రాత్రి మంత్రులకు పోర్ట్‌ఫోలియోలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ హోం, ఆర్థిక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
Jammu Kashmir: భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిన ఇండియన్ ఆర్మీ
ఇకపోతే, అనిల్ విజ్‌కు ఇంధనం, రవాణా శాఖలు అప్పగించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో విజ్ హోం మంత్రిగా ఉన్నారు. సైనీ 12 విభాగాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. హోమ్, ఫైనాన్స్‌తో పాటు అతను ప్రణాళిక, ఎక్సైజ్, టాక్సేషన్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అర్బన్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్, లా మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నాడు. ఇక కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కుమార్తె ఆర్తీరావుకు ఆరోగ్యం, రావు నర్బీర్‌కు పరిశ్రమ అండ్ పర్యావరణం, అరవింద్ శర్మకు జైలు, కిరణ్ చౌదరి కుమార్తె శృతి చౌదరికి మహిళా అండ్ శిశు అభివృద్ధి శాఖలను కేటాయించారు.
Israeli Strikes: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం.. వైమానిక దాడుల్లో 87 మంది మృతి
కృష్ణ లాల్ పన్వార్‌కు డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ, గనులు ఇవ్వగా.. మహిపాల్ దండాకు విద్య, విపుల్ గోయల్‌కు రెవెన్యూ శాఖలను అప్పగించారు. శ్యామ్ సింగ్ రాణా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖను నిర్వహిస్తుండగా, రణబీర్ గాంగ్వా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగాన్ని నిర్వహిస్తారు. కృష్ణ కుమార్ బేడీ సామాజిక న్యాయం, సాధికారత అండ్ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలను కలిగి ఉన్నారు. రాష్ట్ర మంత్రి రాజేష్ నగర్‌కు ఆహారం, పౌర సరఫరాలు ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేటాయించారు. రాష్ట్ర మంత్రి గౌరవ్ గౌతమ్ కు యువజన సాధికారత అండ్ వ్యవస్థాపకత, క్రీడల శాఖలను కేటాయించారు.
Haryana Cabinet portfolios | CM Nayab Singh Saini keeps Home, Finance, Excise and Taxation, Planning, Town & Country Planning and Urban Estates, Information, Public Relations, Language and Culture, Administration of Justice, General Administration, Housing for All, Criminal… pic.twitter.com/OrcmSbIUwx
— ANI (@ANI) October 20, 2024