Prince Harry: ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశీయులు ఉన్నారు. సాధారణంగా రాజవంశీయులు బయటకు రారు. ఏదైనా పెద్ద వేడుక జరిగే సమయంలో.. అది అందులో రాజవంశీయులు తప్పకుండా పాల్గొనాల్సి ఉందంటేనే బయటకు వస్తారు. కానీ 130 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరుకానున్నారు. అది సాక్ష్యం చెప్పడం కోసం. తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ బ్రిటన్ పత్రికపై పరువు నష్టం దావా వేసిన ప్రిన్స్ హ్యారీ .. కోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏళ్ల తర్వాత కోర్టుకు సాక్షిగా హాజరవుతోన్న బ్రిటన్ రాజవంశానికి చెందిన మొదటి వ్యక్తిగా ప్రిన్స్ హ్యారీ నిలవనున్నారు. ఇందుకు సంబంధించిన పరువునష్టం దావా కేసు వచ్చే వారం లండన్ హైకోర్టులో విచారణకు రానుంది.
Read Also: Illicit relationship: ఫ్రెండ్ భార్యతో ఎస్కేప్.. టెన్షన్ పడకు నాఫ్రెండ్‌కు తెలుసంటూ భార్యకు లేఖ
కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీతో పాటు 100 మందికిపైగా ప్రముఖులు డైలీ మిర్రర్ ప్రచురణకర్త మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ సండే మిర్రర్, సండే పీపుల్స్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. లండన్ హైకోర్టులో జరిగే విచారణకు ప్రిన్స్ హ్యారీ సాక్షిగా హాజరవుతున్నారు. రాజు కావడానికి ముందు ఎడ్వర్డ్ -VII 1870లో విడాకుల కేసులోనూ, 1890లో కార్డ్ గేమ్ ఆరోపణలపై పరువునష్టం దావా విచారణకు హాజరయ్యారు. రెండింటిలోనూ ఒక సీనియర్ రాయల్ సాక్ష్యం ఇవ్వడం అదే మొదటిసారి. ఆ తరువాత ఇప్పటి వరకూ బ్రిటన్ రాజకుటుంబంలోని ఎవరూ కోర్టు మెట్టెక్కలేదు. రెండేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ.. బ్రిటీష్ మీడియాతో చట్టపరమైన వివాదాలు.. అలాగే సీనియర్ రాయల్‌పై ఆరోపణలు, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌ల విడుదల వంటి వివాదాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రిన్స్ హ్యారీ కోర్టుకు హాజరైతే ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.