రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశీయులు ఉన్నారు. సాధారణంగా రాజవంశీయులు బయటకు రారు. ఏదైనా పెద్ద వేడుక జరిగే సమయంలో.. అది అందులో రాజవంశీయులు తప్పకుండా పాల్గొనాల్సి ఉందంటేనే బయటకు వస్తారు. కానీ 130 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరుకానున్నారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాతాల్లో ప్రతినెలా ప్రత్యేకంగా డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతి నెల రూ.200 చొప్పున ఇవ్వనుంది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి గ్రామ, వార్డు వాలంటీర్లు తెలుసుకోవచ్చని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా న్యూస్ పేపర్ ద్వారా సమకాలీన అంశాల గురించి తెలుసుకుని దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల…
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వార్తా పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రిక లేని ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూడలేమని వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు పెట్టుకుంటున్నాయన్నారు. కొన్ని పార్టీలు సొంత పత్రికలో సొంత బాకా ఊదుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఒక పత్రికలో ఉన్నది మరో పత్రికలో ఉండదని, సమాజానికి హాని చేసే పత్రికలు వద్దంటూ ఆయన హితవు పలికారు. ఇప్పుడు కొన్ని పత్రికలు సెన్సేషన్ కాదు.. సెన్స్…