Harish Rao: ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు, ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన వత్తిడి ఫలితంగా గవర్నర్ బిల్లును ఆమోదించింది. శాసనసభ, గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘అపాయింటెడ్ డే’ అమలు చేస్తామని బీఆర్ఎస్ నాడు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని మీ దృష్టికి తెస్తున్నాని హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా, ఇంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. వాస్తవంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్ లోడ్ వెహికిల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తున్నది. డ్రైవర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని అయినా వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటించి, విలీన జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించింది. వాటిని కూడా మీరే ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరుతున్నాను. 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు చెప్పిన విద్ధంగానే బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని కోరుతున్నాను. అదనపు బస్సులు సమకూర్చే విషయంలో, పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలో మీరే స్వయంగా చొరవ చూపగలరని విన్నవించుకుంటున్నట్లు హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!