IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
- ఈరోజు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం
- రాత్రి 10 గంటలకు మొదటి టీ20 ఆరంభం
- ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Playing XI vs India: ఇంగ్లండ్, భారత్ మధ్య ఈరోజు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. యూకేలోని చెస్టర్ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. తొలి టీ20కి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించినప్పటికీ.. అభిమానులను ఆశ్చర్యపరుస్తూ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇచ్చింది. అలాగే సీనియర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
భారత్‌పై బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్.. సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లండ్ జట్టులో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెతెల్, టామ్ బాంటన్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్లు బంతితో మాయ చేయగలరు. సీనియర్లు, జూనియర్ల కలయికతో ఇంగ్లండ్ జట్టు బలంగా ఉంది. అయితే పేసర్ జోఫ్రా ఆర్చర్, స్పిన్నర్ ఆదిల్ రషీద్ జట్టులో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
ఫిల్ సాల్ట్
జోస్ బట్లర్
హ్యారీ బ్రూక్ (కెప్టెన్)
జాకబ్ బెతెల్
టామ్ బాంటన్
సామ్ కరన్
విల్ జాక్స్
లియామ్ డాసన్
సాకిబ్ మహ్మూద్
ఆదిల్ రషీద్
ల్యూక్ వుడ్
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్:
జూలై 1: తొలి టీ20 – చెస్టర్-లీ-స్ట్రీట్
జూలై 4: రెండో టీ20 – మాంచెస్టర్
జూలై 7: మూడో టీ20 – నాటింగ్‌హామ్
జూలై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్
జూలై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?